రాజశేఖర్‌ ‘డియో డియో’ డ్యాన్స్‌ చూశారా?

రాజశేఖర్‌ ‘డియో డియో’ డ్యాన్స్‌ చూశారా?
ఇంటర్నెట్‌డెస్క్‌: ‘డియో డియో’ అంటూ సన్నీ లియోని త్వరలో థియేటర్లలో సందడి చేయబోతోంది. రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమాలో సన్నీ ఆడిపాడిన పాట అది. ఆ పాట వీడియో ఆన్‌లైన్‌లో వచ్చింది మొదలు అందరి నోట ‘డియో డియో..’నే. చిత్రబృందం ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా ఈ పాట ప్రస్తావన కచ్చితంగా వస్తోంది. ఈ పాట మేకింగ్‌ వీడియో కూడా విడుదలైంది. అందులో సన్నీని చూసినవాళ్లందరూ ‘సన్నీ సూపర్‌… స్టెప్పులు బంపర్‌’ అంటున్నారు. మరి ఆ పాటకు రాజశేఖర్‌ ఇద్దరు కథానాయికలతో స్టెప్పులేస్తే ఇంకా బాగుంటుంది కదా. సినిమాలో ఆ అవకాశం లేకపోయినా… బయట మాత్రం కుదిరింది. అందులోనూ సినిమా విడుదల కాకుండానే. సినిమా ప్రచారం కోసం ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌కి వెళ్లిన చిత్రబృందం అక్కడ స్టెప్పులతో అలరించింది. రాజశేఖర్‌, పూజ కుమార్‌, శ్రద్ధా దాస్‌ కలసి ‘డియో డియో..’ అంటూ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *