సంక్రాంతి సూర్యుడు

సంక్రాంతి సూర్యుడు
ముగ్గుల పండక్కి భారీ స్థాయిలో పెద్ద చిత్రాలు పోటీ పడడం సర్వ సాధారణమే. ఈసారీ అలాంటి వాతావరణమే కనిపించబోతోంది. పవన్‌ కల్యాణ్‌, నందమూరి బాలకృష్ణలు ఈ పండక్కి తమ సినిమాల్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ‘రోబో 2.ఓ’ వస్తోందనుకొన్నారు. కానీ.. అది కాస్త వేసవికి వెళ్లిపోయింది. ఈ స్థానాన్ని సూర్య భర్తీ చేయబోతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘థానా సేంద కూట్టమ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించనున్నారు. సూర్య సినిమా అంటే అది తెలుగులోనూ విడుదల అవ్వడం ఆనవాయితీ. ఆ లెక్కన పవన్‌, బాలయ్యలతో పాటు సూర్య కూడా ఈ సంక్రాంతికి సందడి చేయడం ఖాయమైందన్నమాట. ‘థానా సేంద కూట్టమ్‌’కి తెలుగులో ఎలాంటి పేరు పెడతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *