సూపర్‌ జోడీ..

సూపర్‌ జోడీ..
నాగార్జున సరసన ఎంతమంది స్టార్‌ కథానాయికలు నటించినా సరే, నాగ్‌తో ఎంతమంది ‘హిట్‌ పెయిర్‌’ అనిపించుకొన్నా సరే.. ‘నాగ్‌తో టబు’ అనగానే ఓ ఆసక్తి మొదలైపోతుంది. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ‘చిత్ర పరిశ్రమ మొత్తమ్మీద నా ఆప్తుడు నాగార్జుననే. హైదరాబాద్‌ ఎప్పుడొచ్చినా వాళ్లింట్లోనే ఉంటా. అమల కూడా నాకు మంచి స్నేహితురాలు’ అని టబు చాలాసార్లు చెప్పింది. వెండి తెరపై నాగ్‌ – టబుల కెమిస్ట్రీ భలే బాగా పండింది. ‘నిన్నే పెళ్లాడతా’తోనే టబు స్టార్‌ అయి పోయింది. ఆ తరవాత ‘ఆవిడా మా ఆవిడే’లోనూ ఇద్దరూ జోడీ కట్టారు. ఇంతకాలానికి మళ్లీ నాగ్‌ – టుబులను ఒకేసారి తెరపై చూసే అవకాశం వస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో టబు కూడా నటించనుందట. ఇదో పోలీస్‌ కథ అని తెలుస్తోంది. టబుని కథానాయికగా చూపిస్తారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *