ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోదండరాం దీక్ష

ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోదండరాం దీక్ష
లాలాపేట, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం తార్నాకలోని తన నివాసంలో మంగళవారం 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సాగుతున్న ఆందోళనలను తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని ఆరోపించారు. ఐకాసపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరించిన వైఖరినే..తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరంకుశ, నిర్బంధ వైఖరికి నిరసనగా దీక్షను చేపట్టినట్లు తెలిపారు. కొలువులకై కొట్లాట సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తెలంగాణ రాజకీయ ఐకాస తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించిన దీక్షను..బుధవారం 3 గంటలకు ముగించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, ప్రొ.హరగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, పీసీసీ కార్యదర్శి బండ చంద్రారెడ్డి, ఓయూ, కేయూ విద్యార్థి ఐకాస, నాయకులు మద్దతు తెలిపారు. కోదండరాంపై నిర్బంధాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఓయూఐకాస తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *