నవాబ్‌ షా ఆలంఖాన్‌ సేవలను గౌరవిస్తాం

నవాబ్‌ షా ఆలంఖాన్‌ సేవలను గౌరవిస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఆలంఖాన్‌ కుటుంబీకులకు పరామర్శ
బర్కత్‌పుర, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సంస్కృతికి ప్రతిరూపమైన నవాబ్‌ షా ఆలంఖాన్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆయన పేరిట రాష్ట్రంలో ఏదైన కార్యక్రమం చేపట్టేందుకు ఆలోచిస్తామన్నారు. ఇటీవల మృతి చెందిన హైదరాబాద్‌ దక్కన్‌ సిగరెట్‌ ఫ్యాక్టరీ అధినేత, పారిశ్రామికవేత్త నవాబ్‌ షా ఆలంఖాన్‌ కుటుంబ సభ్యులను మంగళవారం బర్కత్‌పురలోని ఆయన నివాసంలో సీఎం పరామర్శించారు. నవాబ్‌ షా కుమారులు మహబూబ్‌, ఖాదర్‌, జాహెద్‌, మహ్మద్‌, మహమూద్‌, అహ్మద్‌, ముస్తాఫాలను ఆయన పరామర్శించారు. నవాబ్‌ షాతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నవాబ్‌ షాను గతంలో ఒకసారి కలిశానని.. హైదరాబాద్‌లో మొదటి పారిశ్రామికవేత్త అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించే వ్యక్తి అంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి వెంట గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *