పార్లమెంటు సమావేశాలు… 17 మంది ఎంపీలు పాజిటివ్

Share this Page

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు నిర్వహించిన తప్పనిసరి పరీక్షల్లో లోక్‌సభలో 17 మంది సభ్యులు కరోనా వైరస్ కోసం పాజిటివ్ గా తేలింది. వైరస్ సోకిన ఎంపీలలో, బిజెపి సభ్యులు 12 మంది, వైసీపీ ఎంపీలు ఇద్దరు, శివసేన, డిఎంకె మరియు ఆర్ఎల్పి ఒక్కొక్కరున్నారు. లోక్‌సభ సభ్యులను సెప్టెంబర్ 13, 14 పార్లమెంట్ హౌస్‌లో పరీక్షలు జరపడంతో ఈ వివరాలు తెలిశాయి. పాజిటివ్ వచ్చిన బిజెపి ఎమ్మెల్యే సుకాంత మజుందార్ తన ఆరోగ్యం మంచిగా ఉందంటూ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో 785 మంది ఎంపీలలో 200 మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. వీరందరూ హైరిస్క్ కేటగిరీలో ఉన్నారు. ఇప్పటికే కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు, 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పార్లమెంటు సమావేశాలు భారీ భద్రతా చర్యల మధ్య జరుగుతున్నాయి, ఇందులో ఎంపీలు ఉభయ సభల గదుల్లో భౌతిక దూరాన్ని కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *