సినిమా చూద్దాం థియేటర్లకు చలో చలో….

Share this Page

స్కూళ్ల ప్రారంభంపై రాష్ట్రాలదే నిర్ణయం…

సినిమా హాళ్లు, మల్టిప్లెక్సులు, ఎగ్జిబిషన్ల హాళ్లు, పార్కులు ఇక ఓపెన్ చేసుకోవచ్చంటూ కేంద్రం ఆన్ లాక్ 5 నిబంధనల చిట్టా విప్పింది. అయితే ఎంత మందిని అనుమతించాలన్నదానిపై పరిమితి తప్పదని కేంద్రం తెలిపింది. థియేటర్లు 50 శాతం జనాలను అనుమతించాలని, పరిమితులను విధించాలంది.

Schools can be opened from 15 … Permission to open theaters

అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని సూచించింది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఒక్కొక్కటిగా మినహాయింపులిస్తున్న కేంద్రం తాజాగా స్కూళ్లపైనా 50 శాతం విద్యార్థులతో అనుమతించాలని చెప్పింది. ఐతే స్కూళ్లు తెరవడానికి సంబంధించి తుది నిర్ణయం రాష్ట్రాలదేనంది. ఆన్ లైన్ క్లాసులు సమాంతరంగా నిర్వహించాలని చెప్పింది. విద్యార్థులు ఫిజికల్ గా హాజరు కాకుండా… ఇంటి వద్ద ఆన్ లైన్ చదువుకోవాలన్నా అందుకు అనుమతించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులకు పేరెంట్స్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *