బీహార్ ఎన్నికల నగారా

Share this Page

బీహార్ ఎన్నికల చారిత్రాత్మక ఎన్నికలని… కరోనావైరస్ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికని అభివర్ణించారు ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో మూడు దశల్లో జరుగుతాయని, నవంబర్ 10 న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కరోనావైరస్ సంక్షోభం మధ్యలో జరగబోయే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నిక ఇది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వ్యవస్థను తిరిగి పునఃస్థాపించడమని చెప్పారు. మెడికల్, ఇంజనీరింగ్ పరీక్షలు జెఇఇ, నీట్ పరీక్షలు ఇటీవలే జరిగాయని… జీవితం కొనసాగాలని అందుకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల తర్వాత ప్రపంచం గణనీయంగా మారిపోయింది. కోవిడ్ -19 మహమ్మారి మన జీవితంలో ప్రతి అంశంలోనూ మన జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. నవంబర్ 29 లోగా బీహార్ కొత్తగా 243 మంది సభ్యుల అసెంబ్లీని ఎన్నుకోవాలని అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నామన్నారు

సాధారణ సమయం కంటే మరో గంట సేపు ఎన్నిక అదనంగా నిర్వహిస్తామన్నారు. కరోనా వ్యాధిగ్రస్తులు, క్వారంటైన్లో ఉన్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. క్యాంపెయిన్ లో ఎవరూ కూడా కాంటాక్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాధిగ్రస్తులు పోలింగ్ వేళ ముగిసే సమయంలో ఓటింగ్ కు హాజరుకావాలన్నారు. ఎక్కువ కాలం ఎన్నికల జరక్కుండా, ఇన్ఫెక్షన్ ప్రభావం ఎక్కువ లేకుండా ఉండాలనే పోలింగ్ మూడు దశల్లో పూర్తి చేస్తున్నాన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో మత ఉద్రిక్తత పెరిగేలా ఎవరైనా ప్రయత్నిస్తే వారికి తగు విధంగా శిక్షలుంటాయన్నారు. ఎవరైనా సోషల్ మీడియాను ఉపయోగించి… ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే వారిపై చర్యలు తప్పవని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *